Posted on April 12, 2021 admin No Comments డాక్టర్ సిహెచ్. సులక్షణమణి కమ్యునిటీ ఆరోగ్య కేంద్రం, పెనుగొండ. శారీరక, మానసిక, సామాజిక, భావోద్వేగ (ఎమోషనల్) తదితర విషయాలలో ధారుడ్యం కలిగిన వ్యక్తిని ఆరోగ్యవంతుడిగా గుర్తించాలని పెనుగొండ కమ్యునిటీ ఆరోగ్య కేంద్రానికి చెందిన యోగా మరియు నేచురోపతి నిపుణులు డాక్టర్ సిహెచ్. సులక్షణమణి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఎస్.వి.కె.పి. & డా. కె.ఎస్. రాజు ఆర్ట్స్ & సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఎన్.ఎస్.ఎస్. యూనిట్లు మరియు రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆధునిక ఆరోగ్య రంగం-సవాళ్ళు అనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ సులక్షణమణి మాట్లాడుతూ విద్యార్ధులు కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలని, ఉదయం అల్పాహారం తప్పని సరిగా తీసుకొని కళాశాలకు రావాలని, కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తుందని, మాస్క్ రక్షణకవచంతో సమానమని, శానిటైజర్స్ వినియోగిస్తూ, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్. అధికారి కె.వి.సురేష్ బాబు, బయో టెక్నాలజీ విభాగాధిపతి మరియు రెడ్ రిబ్బన్ క్లబ్ కన్వీనర్ తాడి రమేష్, ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు, విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.