• డా. వై.వి.వి. అప్పారావు, ప్రిన్సిపాల్
    ఎస్.వి.కె.పి. డిగ్రీ కళాశాల.

అమ్మ భాషను విస్మరించరాదు

  • డా. వై.వి.వి. అప్పారావు, ప్రిన్సిపాల్
    ఎస్.వి.కె.పి. డిగ్రీ కళాశాల.

దేశ ప్రజలందరూ అమ్మ భాష అయిన తమ మాతృభాషను మరువరాదని ఎస్.వి.కె.పి. & డా. కె.ఎస్.రాజు ఆర్ట్స్ & సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. వై.వి.వి.అప్పారావు అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు మరియు ఎన్.ఎస్.ఎస్. యూనిట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించి డా. వై.వి.వి.అప్పారావు ప్రసంగిస్తూ మనం ఎన్ని భాషలు నేర్చుకొని మాట్లాడగలిగినా మాతృభాషను విస్మరించరాదని, ఇతర భాషల ద్వారా నేర్చుకొన్న అంశాలను మాతృభాష వికాసానికి వినియోగించాలని, 1999 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగం యునెస్కో ఫిబ్రవరి 21 వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించిందని ప్రిన్సిపాల్ డా. వై.వి.వి. అప్పారావు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా “ప్రాధమిక విద్యారంగంలో మాతృభాష ప్రాధాన్యత” అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలో 11 మంది పాల్గొనగా ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన ద్వితీయ బి.ఏ. విద్యార్ధినులు బి.జ్యోతి, కె.నాగకన్య, బి.రేణుకారాణి లకు ప్రిన్సిపాల్ డా.వై.వి.వి.అప్పారావు జి.కె. పుస్తకాలను, గాంధీజీ ఆత్మకథ పుస్తకాలను అందచేసారు.

కార్యక్రమంలో తెలుగు విభాగాధిపతి డా. ఎం. రాజ్యలక్ష్మి, అధ్యాపకులు షేక్ ఆదమ్ షా, ఎన్.ఎస్.ఎస్. అధికారులు ఆర్.ఎన్. శ్రీనివాసు, కె.వి. సురేష్ బాబు, టి. దివాకర్, చరిత్ర మరియు అర్ధశాస్త్ర విభాగాల అధ్యాపకులు డి.వి.వి.ఎన్. ప్రసాద్, ఎం. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment